సురక్షిత వెబ్సైట్లలో సమయ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఎలా

Firefox Firefox సృష్టించబడినది:

సురక్షితమైనవిగా భావిస్తున్న వెబ్సైట్లు ఉపయోగించే సర్టిఫికెట్లు (వాటి URL "https://" తో ప్రారంభమవుతుంది) పరిమిత కాలానికి మాత్రమే జారీ చేయబడతాయి. మీ సిస్టమ్ యొక్క గడియారం యొక్క ప్రస్తుత విలువతో సరిపోలని ఒక సర్టిఫికెట్‌ని వెబ్సైట్ సమర్పించినట్లయితే, అటువంటి కనెక్షన్ సురక్షితమని ఫైర్‌ఫాక్స్ ధృవీకరించదు మరియు అందువలన "మీ కనెక్షన్ సురక్షితమైనది కాదు"లోపం పేజీని తెరుస్తుంది. ఒక సర్టిఫికెటును రద్దు చేయలేదు అని ధ్రువీకరించే కొన్ని పద్ధతులు కూడా మీ సిస్టమ్, వెబ్ సర్వర్ సరియైన సమయానికి అమర్చడంపై ఆధారపడి ఉంటాయి.

ఇటువంటి సమస్యలను మీ సిస్టమ తేదీ, సమయం, ప్రాంతముల యొక్క సరైన అమరికల ద్వారా పరిష్కరించవచ్చు. దీనివలన సమస్య పరిష్కారం కాకపోతే, ఇది తప్పుగా అమర్చబడిన వెబ్‌సర్వరు వలన అయి ఉండవచ్చు.

మీకు తారసపడే సమయ-సంబంధ లోప సంకేతాల జాబితా

మీకు "మీ కనెక్షన్ సురక్షితం కాదు" అనే లోపం పేజీ చూపబడితే, ఈ లోపం గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందడానికి Advanced నొక్కండి. ఈ క్రింది లోప సంకేతాలలో ఒకటి కాల-సంబంధ లోపం వలన సురక్షిత కనెక్షనును ఏర్పరచలేకపోయినట్టు సూచిస్తుంది:

SEC_ERROR_EXPIRED_CERTIFICATE
SEC_ERROR_EXPIRED_ISSUER_CERTIFICATE
SEC_ERROR_OCSP_FUTURE_RESPONSE
SEC_ERROR_OCSP_OLD_RESPONSE
MOZILLA_PKIX_ERROR_NOT_YET_VALID_CERTIFICATE
MOZILLA_PKIX_ERROR_NOT_YET_VALID_ISSUER_CERTIFICATE

లోప పేజీలో ఉన్న టెక్స్ట్ మీ సిస్టమ్ సమయం బహుశా తప్పు అని ఫైర్‌ఫాక్స్ గుర్తించినపుడు మిమ్మల్ని హెచ్చరిస్తుంది మరియు ఇంకా మీ సిస్టమ్‌లో ప్రస్తుతం అమర్చబడిన తేదీ, సమయం చూపుతుంది. గడియారం అమరికలు తప్పు ఐతే మీరు వాటిని ఈ క్రింద వివరించిన విధంగా సరియైన సమయానికి అమర్చాలి. ప్రదర్శిత సమయ అమరికలు సరైనవి అయినప్పటికీ, మీ సిస్టమ్ యొక్క సమయ స్థాన అమరికలు మీ ప్రస్తుత స్థానానికి సరిపోయేలా చూసుకోవాలి.

మీ సిస్టమ్‌ గడియారాన్ని సరియైన సమయానికి సెట్ చేయుట

మీ సిస్టమ్‌లో వక్రీకృత గడియారం వలన సురక్షిత వెబ్సైట్లలో ఏర్పడే సమయ-సంబంధ లోపాలు మీరు సరైన తేదీ, సమయం, సమయ స్థానం అమర్చుకోవడం ద్వారా పరిష్కరించబడతాయి:.

  1. Windows స్టార్ట్ బొత్తాన్ని నొక్కండి లేదా Windows కీ Windows Keyని నొక్కండి.
  2. ప్రారంభ మెనులో Settings ఎంచుకోండి.
  3. సెట్టింగులులో Time & language ఎంచుకోండి.
  4. Date & time విభాగంలో మీరు ప్రస్తుత తేదీ మరియు సమయం అమరికలను సమీక్షించవచ్చు. మీ అమరికలను మార్చడానికి Change date and time క్రిందనున్న Changeపై నొక్కండి లేదా Time zone డ్రాప్‌డౌన్ మెనూను విస్తరించండి.
    మీ సిస్టమ్ స్వయంచాలకంగా సమయం మరియు సమయ స్థానాన్ని నిర్వహించేట్టు అమరిస్తే, మీరు మామానవీయ మార్పులను చేయలేరు.
  5. మీరు మీ మార్పులన్నీ పూర్తి చేసినట్లయితే, అమరికలు విండోను మూసివేయండి.
  1. ప్రారంభం తెర నుండి, Desktop టైల్ నొక్కండి. డెస్క్టాప్ వీక్షణ తెరవబడుతుంది.
  2. డెస్క్టాప్ నుండి, ఛార్మ్స్‌ను ఆక్సెస్ చేయడానికి దిగువ కుడి చేతి మూలలో హోవర్ చేయండి.
  3. Settings ఛార్మ్ నుండి Control Panel ఎంచుకోండి. కంట్రోల్ ప్యానెల్ విండో తెరవబడుతుంది.
    Control Panel - Win8
  4. కంట్రోల్ ప్యానెల్ విండోలో, Clock, Language, and Region, తరువాత

Date and Time నొక్కండి.

  1. తెరుచుకునే ప్యానెల్ ప్రస్తుత తేదీ మరియు సమయం అమరికలను చూపుతుంది. మీ అమరికలను మార్చడానికి Change date and time లేదా Change time zone బొత్తాన్ని నొక్కండి.
  2. మీ మార్పులను నిర్ధారించడానికి OK నొక్కండి.

మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ యొక్క గడియారం అమర్చుట వ్యాసం చూడండి.

  1. Windows స్టార్ట్ బొత్తాన్ని నొక్కండి లేదా Windows కీ Windows Keyని నొక్కండి.
  2. ప్రారంభ మెనులో, Control Panelని నొక్కండి.
    Control Panel - Win7
  3. కంట్రోల్ ప్యానెల్ విండోలో, Clock, Language, and Region మీద నొక్కి, ఆపై Date and Time పై నొక్కండి.
  4. తెరుచుకునే ప్యానెల్ ప్రస్తుత తేదీ మరియు సమయం అమరికలను చూపుతుంది. మీ అమరికలను మార్చడానికి Change date and time నొక్కండి లేదా Change time zone బొత్తాన్ని నొక్కండి.
  5. మీ మార్పులను నిర్ధారించడానికి OK నొక్కండి.

మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ యొక్క గడియారం అమర్చుట వ్యాసం చూడండి.

  1. Windows Start బొత్తాన్ని నొక్కి Control Panel ఎంచుకోండి.
    Control Panel - WinXP
  2. కంట్రోల్ పానెల్ విండోలో, Date, Time, Language, and Regional Options మరియు Date and Time పై నొక్కండి.
  3. తెరుచుకునే ప్యానెల్ ప్రస్తుత తేదీ మరియు సమయం అమరికలను చూపుతుంది, దీనిని మీరు సరిచేయవచ్చు.
  4. మీ సమయ స్థాన అమరికలను సమీక్షించుటకు మరియు సరిచేయడానికి Time Zone ట్యాబ్‌పై నొక్కండి.
  5. మీ మార్పులు నిర్ధారించడానికి OK నొక్కండి.

మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ యొక్క మీ కంప్యూటర్ యొక్క సమయము, సమయ స్థానము మార్చుటకు వ్యాసం చూడండి.

  1. ఆపిల్ మెనుని నొక్కి System Preferences ఎంచుకోండి.
  2. సిస్టమ్ ప్రాధాన్యతలు విండోలో Date & Timeపై నొక్కండి.
  3. తెరుచుకునే ప్యానెల్ ప్రస్తుత తేదీ మరియు సమయం అమరికలను చూపుతుంది. వాటిని సర్దుబాటు చేయడానికి Set date and time automatically డిసేబుల్ చేసి, మానవీయంగా తేదీ మరియు సమయం నమోదు చేయండి మరియు మీ మార్పులను నిర్ధారించడానికి Save నొక్కండి.
  4. మీ సమయ స్థాన అమరికలను సమీక్షించడానికి, Time Zone ట్యాబుపై నొక్కండి. మీ సమయ స్థానాన్ని సర్దుబాటు చేయడానికి Set time zone automatically using current location డిసేబుల్ చేసి, పటంలో మీ ఉజ్జాయింపు స్థానాన్ని నొక్కి, డ్రాప్‌డౌన్ ప్యానెల్లో మీకు అత్యంత సమీప నగరాన్ని ఎంచుకోండి.
  5. మీరు మీ మార్పులతో పూర్తి చేసినట్లయితే, తేదీ & సమయం విండోను మూసివేయండి.

మరింత సమాచారం కోసం Apple మీ మాక్‌లో సమయము, కాలము అమర్చుట వ్యాసం చూడండి.

గమనిక: మీ పరికరంలో గడియారం నిరంతరం పునఃఅమర్పులను నిరోధిస్తే, అది వాస్తవ కాల గడియారం నడుపుతున్న బ్యాటరీ సెల్ తక్కువగా లేదా ఖాళీగా ఉన్నట్లు సూచిస్తుంది. CMOS బ్యాటరీని ఎలా మార్చాలో తెలుసుకోవడానికి మీ తయారీదారు మాన్యువల్ని సంప్రదించండి.

వెబ్సైట్ యజమానిని సంప్రదించండి

మీకు సురక్షిత వెబ్సైట్లో సమయ సంబంధిత సమస్య ఎదురైతే మరియు మీరు మీ సిస్టమ్ గడియారంలోని సరైన అమర్పులను ఇప్పటికే తనిఖీ చేస్తే, దయచేసి మీరు చేరలేని వెబ్సైటు యొక్క యజమానిని సంప్రదించి ఈ సమస్యను వారికి తెలియచేయండి. ఉదాహరణకు వెబ్సైట్ యజమాని గడువు ముగిసిన ధృవీకరణను పునరుద్ధరించాలి.

హెచ్చరికను తప్పించుట

హెచ్చరిక: మీరు ఆర్థిక లావాదేవీలు జరిగే చట్టబద్ధమైన ప్రధాన వెబ్సైట్ లేదా సైట్ల యొక్క హెచ్చరికను ఎప్పుడూ అధిగమించకూడదు - ఈ సందర్భంలో చెల్లుబాటు కాని సర్టిఫికెట్ మీ కనెక్షన్ అన్యులతో రాజీ పడిందని సూచిస్తుంది.

వెబ్సైట్ అనుమతిస్తే, సర్టిఫికేట్ అప్రమేయంగా విశ్వసించబడకపోయినప్పటికీ, మీరు సైటును సందర్శించగలిగే విధంగా ఒక మినహాయింపును జోడించవచ్చు:

  1. హెచ్చరిక పేజీలో advanced నొక్కండి.
  2. Add Exception… నొక్కండి. "భద్రతా మినహాయింపు జోడించు" డైలాగ్ కనిపిస్తుంది.
  3. వెబ్సైట్ తో సమస్యలను వివరించే వచనాన్ని చదవండి. మీరు విశ్వసనీయత లేని సర్టిఫికెటును మరింత తనిఖీ చేయడానికి View… నొక్కండి.
  4. సైటును మీరు విశ్వసించదలిచారని అనుకుంటే, Confirm Security Exception నొక్కండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి