ఫైర్‌ఫాక్సు నా స్థాన సమాచారాన్ని వెబ్సైట్లతో పంచుకుంటుందా?

Firefox Firefox సృష్టించబడినది: 100% of users voted this helpful

స్థాన-ఎరుక విహరణ

స్థాన-ఎరుక విహరణను ఉపయోగించే వెబ్సైట్లు మీకు మరింత సందర్భోచిత సమాచారాన్ని అందించడానికి లేదా శోధిస్తున్నప్పుడు మీ సమయాన్ని ఆదా చేయటానికి, మీరు ఎక్కడ ఉన్నారో అడుగుతుంది. మీరు మీ ప్రాంతంలో ఒక పిజ్జా రెస్టారెంట్ కోసం వెతుకుతున్నారనుకుందాం. ఒక వెబ్సైట్ మీ స్థానాన్ని పంచుకొమ్మని మిమ్మల్ని అడగడం ద్వారా కేవలం "పిజ్జా" కోసం శోధించి మీకు అవసరమైన సమాధానాలను తెస్తుంది... మరింత సమాచారం లేదా అదనపు టైపింగ్ అవసరం లేదు.

firefox-location-prompt

లేదా, మీరు ఎక్కడికైనా వెళ్లడానికి దిశలను మ్యాపింగ్ చేస్తున్నట్లయితే, మీరు ఎక్కడ నుండి బయలుదేరుతున్నారో వెబ్సైట్ తెలుసుకోగలదు, కనుక దానికి మీరు వెళ్లవలసిన చోటు చెప్తే సరిపోతుంది.

ఈ సేవ పూర్తిగా ఐచ్ఛికం - మీ అనుమతి లేకుండా ఫైర్‌ఫాక్సు మీ స్థానాన్ని పంచుకోదు - మరియు మీ గోప్యతకు అత్యంత గౌరవం ఇవ్వబడుతుంది. మరియు, ఫైర్‌ఫాక్సు యొక్క అన్ని అంశాలలాగా, అది వెబ్ డెవలపర్లు సులభంగా అవలంబించడానికి వీలుగా ఓపెన్ ప్రమాణాలను ఉపయోగించి సృష్టించబడుతోంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

మీరు స్థాన-ఎరుక వెబ్సైటును సందర్శించినప్పుడు, మీరు మీ స్థానాన్ని పంచుకోవాలనుకుంటున్నారా అని ఫైర్‌ఫాక్సు మిమ్మల్ని అడుగుతుంది.

మీరు సమ్మతిస్తే, సమీపంలోని వైర్లెస్ యాక్సెస్ పాయింట్లు మరియు మీ కంప్యూటర్ యొక్క IP చిరునామా గురించిన సమాచారాన్ని ఫైర్‌ఫాక్సు సేకరిస్తుంది మరియు అప్రమేయ జియోలొకేషన్ సేవాప్రదాతకు, గూగుల్ స్థాన సేవలకు మీ స్థానాన్ని అంచనా వేయడానికి పంపుతుంది. ఆ స్థాన అంచనా ఆ తర్వాత అభ్యర్థిస్తున్న వెబ్సైటుతో పంచుకోబడుతుంది.

మీరు సమ్మతించలేదని చెప్పితే, ఫైర్‌ఫాక్సు ఏమీ చేయదు.

ఏ సమాచారం పంపబడుతోంది, ఎవరికి? నా గోప్యత ఎలా రక్షించబడుతుంది?

మీ గోప్యత మాకు చాలా ముఖ్యం, మరియు మీ అనుమతి లేకుండా ఫైర్‌ఫాక్సు మీ స్థానాన్ని ఎప్పటికీ పంచుకోదు. మీరు మీ సమాచారాన్ని అభ్యర్థించే పేజీని సందర్శించినప్పుడు, అభ్యర్థి వెబ్సైట్ మరియు మా మూడవ-పార్టీ సేవాప్రదాతతో ఏ సమాచారం అయినా భాగస్వామ్యం చేయబడటానికి ముందు మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

అప్రమేయంగా, ఫైర్‌ఫాక్సు గూగుల్ స్థాన సేవల ద్వారా మీ స్థానాన్ని నిర్ణయించడానికి ఈ క్రింది వివరాలు పంపుతుంది:

  • మీ కంప్యూటర్ యొక్క IP చిరునామా,
  • సమీపంలోని వైర్లెస్ యాక్సెస్ పాయింట్ల గురించి సమాచారం, మరియు
  • యాదృచ్ఛిక క్లయింట్ ఐడెంటిఫైయర్, గూగుల్ చే ఇవ్వబడినది, ప్రతి 2 వారాలకు ముగుస్తుంది.

Google స్థాన సేవలు అప్పుడు మీ అంచనా భౌగోళిక స్థానాన్ని అందిస్తుంది. గూగుల్ సేకరించిన మరియు ఉపయోగించే సమాచారం యొక్క పూర్తి వివరణ కోసం దయచేసి గూగుల్ జియోలొకేషన్ గోప్యతా విధానం చూడండి.

మీ గోప్యతను కాపాడడానికి ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ ద్వారా సమాచారం మార్పిడి చేయబడుతుంది. ఫైర్‌ఫాక్సు మీ స్థాన సమాచారాన్ని కలిగి ఉన్న తరువాత, అది దాన్ని అభ్యర్థించిన వెబ్సైటుకు పంపుతుంది. మీరు సందర్శిస్తున్న వెబ్సైట్ పేరు లేదా దాని స్థానం, లేదా ఏవైనా కుకీలు, ఎప్పటికీ గూగుల్ స్థాన సేవలతో భాగస్వామ్యం చేయబడవు.

ఫైర్‌ఫాక్సు సేకరించిన మరియు ఉపయోగించిన సమాచారం యొక్క పూర్తి వివరణ కోసం, దయచేసి Firefox గోప్యతా నోటీసు చూడండి.

మీ స్థాన సమాచారంతో అభ్యర్థిస్తున్న వెబ్సైటు ఏమి చేస్తుంది అనే సమాచారం కోసం దయచేసి ఆ వెబ్సైట్ యొక్క గోప్యతా విధానాన్ని చూడండి.

సైటుకు మంజూరు చేసిన అనుమతిని నేను ఎలా రద్దు చేస్తాను?

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. "స్థానం" కోసం వెతకడానికి ప్రాధాన్యతల శోధన పెట్టెను ఉపయోగించండి.
    preferences-search
  3. అనుమతులు విభాగంలో స్థానం Settings ఎంచుకోండి.
    preferences-search-results-location
  4. మీరు స్థాన అనుమతులు మంజూరు చేసిన సైట్ల జాబితాను సమీక్షించండి లేదా మార్చండి. settings-location-permissions
  1. మీరు అనుమతి ఇచ్చిన సైటుకు వెళ్లండి.
  2. టూల్స్ మెన్సుకు వెళ్ళండి, ఆపై పేజీ సమాచారం ఎంచుకోండి.
    tools_page info.png
  3. అనుమతులు ట్యాబును ఎంచుకోండి.
  4. మీ స్థాన ప్రవేశము అమరికను మార్చండి.

నా వెబ్ సైట్ కు జియోలొకేషన్ మద్దతును ఎలా జతచేయగలను?

మీరు జియోలొకేషన్ మద్దతుని మీ సేవలోకి కి the Geolocation API guide at MDN web docs ద్వారా కలపవచ్చు.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి