మీరు ఒక కొత్త ట్యాబును తెరచినప్పుడు ఫైర్‌ఫాక్సు తాజా మరియు ఎక్కువగా దర్శించిన సైట్లు, జనరంజక సైట్లు మరియు వ్యాసాలు చూపించడం ద్వారా మీకు ఉపయుక్త కంటెంటును పొదండం సులువు చేస్తుంది. మీరు [[How to set the home page|వేరే ముంగిలి పేజీని అమర్చుకొనుట] చేయకపోతే, కొత్త ట్యాబు పేజీయే మీ అప్రమేయ ముంగిలి పేజీ అవుతుంది.
మీరు ఫైర్‌ఫాక్సును మొదటిసారి ఉపయోగించినపుడు, అతి ప్రసిద్ధ వెబ్సైట్లను మరియు జనరంజక శోధన సాధనాలు మీరు చూస్తారు. ఇవి చివరకు మీ విహరణ చరిత్రలో ఎక్కువగా మరియు ఇటీవల దర్శించిన సైట్ల లంకెలతో భర్తీ చేయబడతాయి.
కొత్త ట్యాబు పేజీలో ఫైర్‌ఫాక్సు వెబ్సైటు లంకెలను గోరంత చిత్రాలుగా (సూక్ష్మ చిత్రాలు) లేదా లోగోలుగా చూపిస్తుంది; వీటినే "టైల్స్" అని అంటారు.
మీరు ఫైర్‌ఫాక్సును మొదటిసారి ఉపయోగించినపుడు, మొజిల్లా వెబ్సైట్ల లంకెలను చూస్తారు. ఇవి చివరకు మీ విహరణ చరిత్రలో ఎక్కువగా మరియు ఇటీవల దర్శించిన సైట్ల లంకెలతో భర్తీ చేయబడతాయి.
ఈ పేజీని మీ అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఎలాగో ఈ క్రింది వ్యాసాలలో చూడండి:
- క్రొత్త ట్యాబు అమరికలను మార్చడానికి, దాచుట లేదా క్రొత్త ట్యాబ్ లో టైల్స్ ప్రదర్శించుట చూడండి.
- క్రొత్త ట్యాబు పేజీని అనుకూలీకరించడానికి, క్రొత్త టాబ్ పేజీ అనుకూలీకరించుట చూడండి.