పెద్ద అటాచ్మెంట్ల కొరకు ఫైల్ లింక్

(FileLink నుండి మళ్ళించబడింది)

ఈ వ్యాసం యొక్క గడువు తేదీ ముగిసి ఉండవచ్చు.

ఒక ముఖ్యమైన మార్పు ఈ ఆధారపడిన ఇంగ్లీష్ వ్యాసంకు జరిగి ఉండవచ్చు. ఈ పేజీ నవీకరించబడే వరకు, మీరు దీన్ని సహాయకరంగా ఉండవచ్చుl: Filelink for Large Attachments

Thunderbird Thunderbird చివరిగా నవీకరించినది:

చాలా ఇమెయిల్ సర్వర్లు పెద్ద ఫైలు జోడింపులతో కూడిన సందేశాలను అంగీకరించవు. ఈ ఫైలు పరిమాణ పరిమితి అనేది మెయిల్ సర్వరు అమరికల ప్రకారం మారుతూ ఉంటుంది. మీరు ఒక పెద్ద జోడింపుతో కూడిన సందేశాన్ని పంపగలిగినా కూడా దాన్ని స్వీకరించే మెయిల్ సర్వర్ పెద్ద జోడింపు గల సందేశాన్ని తిరస్కరించవచ్చు. ఇదంతా థండర్‌బర్డ్ నియంత్రణలో లేని విషయము.

థండర్‌బర్డ్ ఫైల్‌లింక్ ఈ సమస్యను తొలగించడానికి ఆన్లైను నిల్వ సేవలకు మద్దతునిస్తుంది. ఇది మిమ్మల్ని ఒక ఆన్లైను నిల్వ సేవకు జోడింపులను ఎక్కించడానికి, ఆ తరువాత సందేశంలో ఉన్న జోడింపుని ఒక లంకెలా మార్చడానికి అనుమతిస్తుంది. సందేశ గ్రహీత ఆ లంకెపై నొక్కడం ద్వారా ఆ జోడింపుని దింపుకోగలరు. అదనపు ప్రయోజనం ఏమిటంటే పెద్ద ఫైళ్లను పంపించడం, స్వీకరించడం అనేది ఇంకా వేగంగా జరుగుతుంది; మీరు, గ్రహీత కూడా డిస్క్ స్పేస్ ఆదా చేసుకోగలుగుతారు.

మీరు థండర్‌బర్డ్ ఫైల్‌లింకును సంప్రదాయ జోడింపులుతో పాటు ఉపయోగించవచ్చని గమనించగలరు. ఉదాహరణకు, మీరు ఒకే సందేశంలో చిన్న ఫైళ్లను సందేశానికి నేరుగా చేర్చి, పెద్ద జోడింపులకు ఫైల్‌లింకును వాడవచ్చు.

ఈ క్రింది సూచనలు ఫైల్‌లింకును బాక్స్ ఆన్లైను నిల్వ సేవతో ఎలా ఆకృతీకరించి, ఉపయోగించాలో తెలుపుతాయి. వారి సేవలను థండర్‌బర్డులో జోడించడానికి మాకు వారితో ఒక ఒప్పందం కూడా ఉంది. (ఇంతకుముందు మాకు హైటైల్, మునుపు యూసెండ్ఇట్, తో ఒప్పందం ఉండేది). అయితే ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ యాడాన్స్ ద్వారా ఫైల్‌రన్, హుబిసి, మెగా, ఓన్‌క్లౌడ్, పైడియో (మునుపు అజాక్స్ప్లోరర్), సిన్నెఫో, ~ఒకియానోస్ వంటి ఇతర సేవా ప్రదాతలను జోడించారు.

ఫైల్‌లింకును ఆకృతీకరించుట

ఫైల్‌లింకును ఉపయోగించడానికి మీరు ఒక ఆన్లైను నిల్వ సేవా ప్రదాత వద్ద ఒక కొత్త ఖాతాను రూపొందించుకోవాలి (లేదా ఉన్న ఖాతాను ఆకృతీకరించుకోవాలి).

  1. థండర్బర్డ్ ఎగువన,Toolsమెనూ (Alt + T)ను క్లిక్ చేసిన తరువాత ఇది ఎంచుకోండిOptions…Optionsమెనూ బార్ లో,ఇది క్లిక్ చేసి Thunderbird మెనూ లో తరువాత ఇది ఎంచుకోండిPreferences థండర్బర్డ్ ఎగువన, క్లిక్ చేసినEdit తరువాత ఇది క్లిక్ చేయండిPreferencesలేదా అప్లికేషను మెనూ బటన్ ను క్లిక్ చేసి New Fx Menuఇది ఎంచుకోండిOptions…OptionsPreferences.
  2. జోడింపుల ప్యానెల్ ఎంచుకోండి, మరియు అవుట్గోయింగ్ టాబ్ ఎంచుకోండి.
  3. Add బొత్తాన్ని నొక్కండి. సెటప్ ఫైల్‌లింక్ ప్యానల్ తెరుచుకుంటుంది.
  4. డ్రాప్-డౌన్ జాబితా నుండి కావలసిన సేవా ప్రదాతను ఎంచుకోండి.
    • బాక్స్ ఎంచుకుని, Set up Account బొత్తాన్ని నొక్కండి, లేదా ఒక కొత్త ఖాతాను రూపొందించేందుకు ఒక బాక్స్ ఖాతాను పొందండి ... లంకెను నొక్కండి.
      గమనిక: వేరే ఖాతాను అమర్చుకొనడానికి, మీరు దాని ప్రదాత యొక్క పొడగింతను స్థాపించడానికి (కింద చూడుము.)
  5. కొనసాగించడానికి Set up Account నొక్కండి.
FilelinkDialog

మీరు ఒక కొత్త ఖాతాని సృష్టిస్తుంటే, ఒక విహారిణి విండో తెరవబడి దానిలో సేవాప్రదాత నమోదు పేజీని ప్రదర్శిస్తుంది. సూచనల ప్రకారం ఒక ఖాతాని సృష్టించండి. సేవాప్రదాత మీకు ఒక ధ్రువీకరణ ఇమెయిల్ సందేశాన్ని పంపుతుంది. మీ ఖాతాను సక్రియం చేయడానికి ఆ సందేశంలోని ధ్రువీకరణ లంకెను నొక్కండి. పైన డయలాగ్‌లో చూపినట్లు మీ వాడుకరి పేరు (మీ ఇమెయిల్ చిరునామా), మీ సంకేతపు మాటను అడిగినప్పుడు నమోదు చేయండి.

ఒక సందేశ జోడింపు ఒక నిర్ణీత పరిమాణం దాటినపుడు థండర్‌బర్డ్ మిమ్మల్ని ఫైల్‌లింక్ వాడమని సూచించాలంటే ప్రధాన ఆకృతీకరణ డయలాగ్‌నందు, "కంటే పెద్ద ఫైళ్లను పంచుకునే ప్రతిపాదన"ను ఎంచుకుని, ఒక ఫైల్ పరిమాణం (మెగాబైట్లలో) పేర్కొనాలి.

ఫైల్‌లింక్ ఉపయోగించుట

మీరు ఒక ఫైలును ఒక సందేశానికి జతపరిచేటప్పుడు, ఆ ఫైలు పరిమాణం మీరు పైన పేర్కొన్న దానికన్నా ఎక్కువైతే థండర్‌బర్డ్ స్వయంచాలకంగా మీకు ఫైల్‌లింక్ వాడడాన్ని ప్రతిపాదిస్తుంది:

FileLinkAsk

ఒక ఫైలుని ఫైల్‌లింక్ ఉపయోగించి మాత్రమే జత చేయాలనుకుంటే (జత చేయబడిన ఫైలు నిర్దిష్ట పరిమాణానికి మించి ఉన్నదా అని నిర్ధారించడానికి థండర్‌బర్డ్‌పై ఆధారపడటం కంటే), మీరు ఫైల్‌లింక్ మెను ఐచ్ఛికం పక్కన ఉన్న Attach బొత్తం పక్కన ఉన్న క్రిందివైపు బాణంపై నొక్కవచ్చు.

ఆన్లైను నిల్వ సేవాప్రదాతకు ఫైలును ఎక్కించడానికి Link బొత్తంపై నొక్కండి. (లేదా Ignore నొక్కడం ద్వారా ఫైలును సంప్రదాయ జోడింపులులాగా జోడించవచ్చు.)

మీరు Link ఎంచుకున్నప్పుడు ప్రదర్శించబడిన సందేశం ఇలా తాజాపరచబడుతుంది.

FileLinkLinkingMessage

లంకెచేయడం పూర్తయినప్పుడు - అంటే మీ జోడింపును సేవాప్రదాతకు ఎక్కించిన తరువాత - మీ ఇమెయిల్ మార్చబడుతుంది, కొంత పాఠ్యం మరియు ఒక లంకె ఈ క్రింద చూపించిన విధంగా మీ ఇమెయిల్ బాడీకి జోడించబడుతుంది:

FileLinkLinked

గమనిక: HTML రూపంలో సందేశాలను రూపొందించు అనేది ఖాతా అమరికలలో తీసివేయబడితే సందేశం సాదా పాఠ్యంలో కనపడుతుంది.

గ్రహీతలు సందేశాన్ని అందుకున్నప్పుడు వారు అదే సమాచారాన్ని చూస్తారు మరియు సందేశంలోని లంకెను నొక్కితే అది జోడింపును దింపుకొనే పేజీకి తీసుకువెళుతుంది.

ఫైల్‌లింక్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ఫైల్‌లింక్ ద్వారా మీరు పంపే జోడింపులు మొజిల్లా సర్వర్లలో నిల్వచేయబడవు. ప్రతి ఫైల్ నిల్వ సేవాప్రదాత దాని స్వంత గోప్యతా విధానం, సేవా నిబంధనలను కలిగి ఉంటుంది. ఫైలు నిల్వ సేవాప్రదాత ఫైల్‌లింక్ లక్షణాన్ని అది వారి విధానాలకు అనుగుణంగా ఉన్నదని నిర్ధారించుటకై సమీక్షించింది.

Q: ఏ ప్రదాతని ఎంచుకున్నారో మొజిల్లాకి తెలుస్తుందా?

ఆ: లేదు. వాడుకరి ఏ ప్రదాతని ఎంచుకున్నారో మొజిల్లాకి తెలియదు. ప్రదాత ఆకృతీకరణ వివరాలు స్థానిక యంత్రంలో నిల్వ చేయబడుతాయి.

ప్ర: ప్రస్తుతం ఏ నిల్వ సేవలు మద్దతు చేయబడుతున్నాయి?

ఆ: థండర్‌బర్డ్‌కు వారి సేవలను జోడించే విధంగా మేము బాక్స్తో ఒక ఒప్పందం చేసుకున్నాము. హైటెయిల్తో చేసుకున్న ఒప్పందం ఇకపై చెల్లదు. మరిన్ని ప్రదాతల మద్దతుకై మీరు ఇలాంటి పొడగింతలను స్థాపించుకోవచ్చు:

Q: నిల్వ సేవ నా జోడింపులను చూడగలదా?

ఆ: మీరు ఫైలును అప్లోడు చేసేముందు గుప్తీకరించకపోతే నిల్వ సేవలు, అలాగే జోడింపు లంకె దొరికిన వారెవరైనా ఆ ఫైలును చూడగలరు. వాడుకరులు స్వతహాగా ఈ బాధ్యతను ఏ సేవాప్రదాతకు అప్పగించాలో వారే నిర్ణయించుకోవాలి. (సేవాప్రదాతలు సాధారణంగా వారి సేవా నిబంధనలలో మీ గోప్యతాహక్కులను వివరిస్తారు.) ప్రామాణిక జోడింపు నిర్వాహకత కూడా గుప్తీకరించబడదని గమనించండి. మీరు ఒక జోడింపును "సాధారణ" విధానంలో పంపినపుడు, మీ సిస్టం, స్వీకర్త సిస్టం మధ్యలో ఉన్న ఎవరైనా ఆ ఫైలు సమాచారం పొందవచ్చు (మీ ఇమెయిల్ సేవాప్రదాత వంటివారు). ఫైల్‌లింక్ నిల్వ సేవాప్రదాతకు పంపే ఫైలును HTTPS అనే సురక్షిత విధానం ద్వారా పంపుతుంది కనుక ఈ విధానం మరింత సురక్షితం.

నిల్వ సేవాప్రదాత సైటులో నా ఫైలు ఎంతకాలం అందుబాటులో ఉంటుంది?

ఆ: మీరు పనిగట్టుకుని తొలగించేవరకు మీ ఫైలు నిల్వ సేవాప్రదాత సైటులో అందుబాటులో ఉంటుంది. మీ ప్రదాత సైటులోకి లాగిన్ అయ్యి మీ నిల్వస్థలంలోని ఫైళ్లను చూడడం, తొలగించడం చేయవచ్చు.

Q: మీరు ఏ సేవా ప్రదాతను లేదా ఏ ప్రోటోకాలుకు మద్దతునిస్తారు?

ఆ: మేము SpiderOakకు మద్దతు ఇద్దామనుకుంటున్నాము. ఎవరైనా వేరే సేవలకు లేదా ప్రొటోకాల్సుకు మద్దతుని జోడించాలనుకుంటే మా "Up-for-grabs" ప్రాజెక్టు అందుబాటులో ఉంది. అలాగే ఫైల్‌లింక్ లక్షణం కోసం డెవలపర్ డాక్యుమెంటేషన్ కూడా చూడండి.

Q: ఇలా బయటి ప్రదాతల వద్ద నా ఫైళ్లను నిల్వ చేసుకునే ఆలోచన నాకు నచ్చలేదు. సాధారణ జోడింపులు ఇంకా పనిచేస్తాయా?

ఆ: సాధారణ ఇమెయిల్ జోడింపులు ఇంతకు ముందులాగే ఇంకా పని చేస్తాయి. మీకు కోరుకుంటే పెద్ద జోడింపులను వేరేచోట అప్లోడు చేసే వెసులుబాటును మీకు ఇచ్చాము అంతే. థండర్‌బర్డ్‌లో పెద్ద ఫైలు అంటే 1MB, కానీ దీనిని థండర్‌బర్డ్ అభిరుచులలో మార్చుకోవచ్చు:

  1. థండర్బర్డ్ ఎగువన,Toolsమెనూ (Alt + T)ను క్లిక్ చేసిన తరువాత ఇది ఎంచుకోండిOptions…Optionsమెనూ బార్ లో,ఇది క్లిక్ చేసి Thunderbird మెనూ లో తరువాత ఇది ఎంచుకోండిPreferences థండర్బర్డ్ ఎగువన, క్లిక్ చేసినEdit తరువాత ఇది క్లిక్ చేయండిPreferencesలేదా అప్లికేషను మెనూ బటన్ ను క్లిక్ చేసి New Fx Menuఇది ఎంచుకోండిOptions…OptionsPreferences.
  2. జోడింపు ప్యానల్ ఎంచుకుని, అవుట్గోయింగ్ టాబ్ ఎంచుకోండి.
  3. Filelink హెచ్చరిక ఫైలు పరిమాణం సెట్ చేయండి.

కంటే పెద్ద ఫైళ్లను పంచుకునే ప్రతిపాదన అనే ఐచ్ఛికం ఎంపిక తీసివేయడంద్వారా కూడా అప్లోడ్ ప్రతిపాదనను పూర్తిగా నిలిపివేయవచ్చు.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి