Firefox
Firefox
చివరిగా నవీకరించినది:
ఒక సమస్యను పరిష్కరించడానికి గానీ లేదా ఫైర్‌ఫాక్సు తాజాపరచబడినదా అనేవి తెలుసుకోవడానికి మీరు ఏ ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని వాడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
- మెను బొత్తాన్ని నొక్కండి , help నొక్కి ఎంచుకోండి. మెనుబార్‌లో ఫైర్‌ఫాక్సు గురించిన విండో కనిపిస్తుంది. ఫైర్‌ఫాక్సు పేరు క్రింద రూపాంతర సంఖ్య ఉంటుంది. మెను నొక్కి ఎంచుకోండి.
"Here is an example of what the About Firefox window will look like:"
గమనిక: ఫైర్‌ఫాక్సు గురించి అనే విండో తెరవడం అనేది అప్రమేయంగా ఒక నవీకరణ తనిఖీని ప్రారంభిస్తుంది. ఫైర్‌ఫాక్సు నవీకరించిన రూపాంతరం అందుబాటులో ఉంటే అది స్వయంచాలకంగా దించుకోబడుతుంది. లీనక్సులో మీరు మొజిల్లా వెబ్సైటు నుండి దించుకున్న బిల్డ్ వాడినప్పుడే ఇలా జరుగుతుంది; లేకపోతే, నవీకరణలు మీ ప్యాకేజి నిర్వాహకి ద్వారా జరుగుతాయి. మరింత సమాచారం కోసం ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం చూడండి.
- ప్రత్యామ్నాయంగా, మెను బొత్తము నొక్కండి, help నొక్కి ఎంచుకోండి. ఒక కొత్త ట్యాబులో "about:support" చిరునామాతో ఒక పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో "Application Basics" విభాగం క్రింద మీ ఫైరుఫాక్సు రూపాంతరం నమోదు చేయబడి ఉంటుంది. మరింత సమాచారం కోసం Use the Troubleshooting Information page to help fix Firefox issues చూడండి.