ఫైర్‌ఫాక్స్ వెర్షను 52 మార్చి 7, 2017న విడుదల అయినప్పటినుండి, స్థాపించబడిన NPAPI ప్లగిన్లు, అడోబి ఫ్లాష్ మినహా, ఫైర్‌ఫాక్స్‌లో ఇకపై మద్దతు చేయబడవు. మీ కంప్యూటర్లో అవి స్థాపించబడినప్పటికీ, జావా, మైక్రోసాఫ్ట్ సిల్వర్‌లైట్, అడోబి అక్రోబాట్ వంటి ఫైర్‌ఫాక్స్ లోడ్ చేయని కొన్ని ప్లగిన్లు ఉన్నాయి. వివరాల కోసం ఈ అనుకూలతా పత్రం చూడండి.
గత కొద్ది సంవత్సరాలుగా, ఫైర్‌ఫాక్స్ వివిధ వెబ్ APIలను అమలుచేసింది, తద్వారా వెబ్సైట్లు ఎల్లప్పుడూ ప్లగిన్లు లేకుండా చేసిన పనులనే ఇపుడూ చేయగలవు, కనుక, మీ జాల విహరణ అనుభవంలో ఏమీ తేడాను గమనించలేరు.
ఫైర్‌ఫాక్స్ ఇలా ఎందుకు చేసింది?
జాలలో వీడియో, ధ్వని, ఆటలవంటి స్థిర పేజీలు కాని వెబ్సైటులు చాలానే ఉన్నాయి. NPAPI ప్లగిన్లు, ముఖ్యంగా ఫ్లాష్ వంటివి, ఇటువంటి క్రియాశీల పేజీలను సాధ్యం చేయుటకు సహాయపడ్డాయి. కానీ అవి మీ విహరణను నెమ్మదిగా, తక్కువ సురక్షితంగా మరియు క్రాష్ ఎక్కువ అవకాశం కల్పిస్తాయి.
గత కొద్ది సంవత్సరాలు ఫైర్‌ఫాక్స్ ఈ ప్లగిన్లకు ప్రత్యామ్నాయాలను నిర్మించడానికి కష్టపడి పనిచేసింది. అవే వెబ్ APIలు. మీ జాల భద్రత, స్థిరత్వం, పనితనాలను తగ్గించకుండానే పనిచేస్తూ, ప్లగిన్ల స్థానాన్ని భర్తీ చేసేట్టు వీటిని తయారుచేశారు.
ఇంతకుముందు, ఈ వెబ్ APIలు పూర్తిగా సిద్ధం కాలేదు, కనుక ఫైర్‌ఫాక్స్ ప్లగిన్లను మానవీయంగా లోడు చేయడం ద్వారా ఈ పరివర్తనను మొదలుపెట్టింది (క్రియాత్మకం చేయుటకు నొక్కు).
నేడు అవి సిద్ధం. చాలా సైట్లు వాటిని అవలంబించాయి, మరియు దాదాపు అన్ని మీకు ఇష్టమైన పేజీలను పాత, అసురక్షిత ప్లగిన్లు వాడకుండానే చూసి ఆనందించవచ్చు. ఈ NPAPI ప్లగిన్ల మద్దతును తొలగించడానికి ఫైర్‌ఫాక్స్ గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర ఆధునిక విహారిణుల సరసన చేరింది.