ఈ వ్యాసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఒక సరళ ఆన్లైన్ సంస్థాపకి ద్వారా ఎలా దింపుకుని, స్థాపించుకోవాలో వివరిస్తుంది. (ఎక్కువ తెలిసిన వాడుకరులు: వ్యాసం చివర ఉన్న For advanced users విభాగం చూడండి.)
- ఫైర్‌ఫాక్సును ఒక మునుపటి రూపాంతరం నుండి నవీకరించుటకు ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం చూడండి.
ఫైర్‌ఫాక్సును స్థాపించుటకు ముందు సిస్టమ్ ఆవశ్యకతలు చూసి కావలసిన నిర్వాహక వ్యవస్థ, సిఫారసు చేయబడిన హార్డ్‌వేర్ మీ కంప్యూటరుకు ఉందని నిర్ధారించుకోండి..
ఒక పరిమిత విండోస్ XP ఖాతా ఉపయోగించి ఫైర్‌ఫాక్సును స్థాపించవద్దు. మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ మద్దతు వ్యాసం How to determine your user account type in Windows చూడండి.
- ఈ ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీని మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జి వంటి ఏదేని విహారిణిలో సందర్శించండి.
-
- మీరు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లోరర్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జి ఉపయోగిస్తే, పేజీ దిగువన ఒక నోటిఫికేషన్ బార్లో సంస్థాపకి అమలు లేదా ఫైలును మీ కంప్యూటర్లో భద్రపరచుకొనుటకు ఎంపికలతో కనపడుతుంది. ప్రక్రియను ప్రారంభించుటకు ని నొక్కండి.
- ఇతర విహారిణులలో మీరు మొదట ఫైర్‌ఫాక్సు సంస్థాపకిని మీ కంప్యూటరులో భద్రపరచాలి, తదుపరి మీరు దింపుకోలు చేసుకున్న ఫైలును తెరవాలి.
గమనిక: మీరు గనక "తెరచిన ఫైలు - భద్రతా హెచ్చరిక" డయలాగ్ చూసినట్లైతే లేదా పై నొక్కండి.
బొత్తాన్ని నొక్కండి. దింపుకోలు చేసుకునే ఫైర్‌ఫాక్సు సంస్థాపకి స్వయంచాలకంగా మీ కంప్యూటరు కొరకు లభ్యమయ్యే ఉత్తమ ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని సిఫార్సు చేస్తుంది.
- మిమ్మల్ని మీ కంప్యూటర్లో ఫైర్‌ఫాక్సు సంస్థాపకి చేయు మార్పులకు అనుమతిని అడుగుటకు "వాడుకరి ఖాతా నియంత్రణ" డయలాగ్ తెరచుకోవచ్చు. ఈ డయలాగ్ కనపడితే, స్థాపన మొదలుపెట్టుటకు
- ఫైర్ఫాక్సు స్థాపనను ముగించేవరకు వేచియుండండి.
- గమనిక: చాలా పాత ఫైర్‌ఫాక్సు రూపాంతరం లేదా చాలా పాత ప్రొఫైలు సమాచారం కనుగొన్నట్టైతే ఫైర్ఫాక్సు సంస్థాపకి ఒక నవీకరణ లేదా పునఃస్థాపన బొత్తము మరియు అప్రమేయ అమరికలను పునరుద్ధరించుటకు, పొడగింతలను తొలగించుటకు ఎంపికను కలిగియుండవచ్చు. పాత సమాచారాన్ని ఉంచుటకు చెక్‌బాక్సు ఎంపికను తీసివేసి లేదా పై నొక్కి స్థాపనను మొదలుపెట్టవచ్చు.
-
- స్థాపన పూర్తి అయిన తరువాత ఫైర్‌ఫాక్సు తెరచుకుంటుంది.
సమస్యలు ఉన్నాయా?
ఈ క్రింద మీకు సహాయపడే వ్యాసాలు ఉన్నాయి:
- ఫైర్‌ఫాక్స్ మొదలు కాదు - పరిష్కారాలు కనుగొనేందుకు
- "ఫైర్‌ఫాక్స్ ఇప్పటికే అమలులో కానీ స్పందించడం లేదు" దోష సందేశం - ఎలా పరిష్కరించాలో
- మీరు "Firefox cannot be installed. This version of Firefox requires a processor with SSE2 support." అనే సందేశాన్ని చూసినట్లైతే, Your hardware is no longer supported చూడండి.
ఎక్కువ తెలిసిన వాడుకరులకోసం
ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీ]లోని బొత్తము మీ నిర్వాహక వ్యవస్థకు అనుకూలమైన ఫైర్‌ఫాక్సు రూపాంతరాన్ని స్వయంచాలకంగా స్థాపించగల ఒక క్రమబద్ధమైన ఆన్లైను సంస్థాపకిని సమకూరుస్తుంది. ఉదాహరణకు, 64-బిట్ విండోస్పై సంస్థాపకి 64-బిట్ ఫైర్‌ఫాక్సు రూపాంతరం కోసం (వివరాలు ఇక్కడ).
మీరు ఒక పూర్తి ఆఫ్లైను సంస్థాపకి, వేరే నిర్వాహక వ్యవస్థలో ఒక ఫైర్‌ఫాక్సు రూపాంతరం (64-బిట్ విండోస్‌లో 32-బిట్ ఫైర్‌ఫాక్సు), లేదా మీరు ఫైర్‌ఫాక్సు స్థాపనను అనుకూలీకరించుటకు ఫైర్‌ఫాక్సు దింపుకోలు పేజీలో Advanced Install Options & Other Platforms లంకె ఉపయోగించండి. మీ స్వంత భాషను ఉపయోగించడానికి వేరే భాషలో దింపుకోండి లంకె ఉపయోగించండి.
పూర్తి, ఆఫ్లైను సంస్థాపకిలో ఉన్న ఎంపికలు Custom installation of Firefox on Windows అనే వ్యాసంలో వివరించబడ్డాయి.