ఈ వ్యాసం "కుకీలు" అంటే ఏమిటో, వాటిని ఎలా ఉపయోగిస్తారో, ఫైర్‌ఫాక్స్‌లో వాటిని ఎలా నిర్వహించాలో వివరిస్తుంది.
కుకీ అంటే ఏమిటి?
కుకీ అనేది మీరు సందర్శించే వెబ్‌సైటు మీ కంప్యూటర్లో నిల్వ చేసే సమాచారం.
కొన్ని విహారిణుల్లో ప్రతి కుకీ ఒక చిన్న ఫైలు, కానీ ఫైర్‌ఫాక్స్‌లో అన్ని కుకీలు ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు సంచయంలోని ఒకే ఫైలులో నిల్వ ఉంచబడతాయి.
తరచుగా కుకీలు వెబ్‌సైటుకి మీ అమరికలను, మీ ప్రాధాన్యతా భాష లేదా మీ ప్రాంతం వంటివాటిని, నిల్వ ఉంచుతాయి. మీరు ఆ సైటుకి మళ్ళీ వెళ్ళినప్పుడు, ఆ సైటుకి సంబంధించిన కుకీలను ఫైర్‌ఫాక్స్ ఆ సైటుకి పంపిస్తుంది. దీనివలన ఆ వెబ్‌సైటు మీ అవసరాలకు తగ్గట్టు సమాచారాన్ని చూపించే వీలుకలుగుతుంది.
కుకీలు వ్యక్తిగత గుర్తింపు సమాచారం (మీ పేరు, ఇంటి చిరునామా, ఈమెయిలు చిరునామా, లేదా టెలిఫోను నంబరు వంటివి) తో సహా పలు రకాల సమాచారాన్ని నిల్వ చేయగలవు. అయితే, ఈ సమాచారం మీరు ఇస్తేనే నిల్వ చేయబడుతుంది - మీరు ఇవ్వని సమాచారాన్ని వెబ్‌సైట్లు పొందలేవు, మీ కంప్యూటర్లోని ఇతర ఫైళ్ళను చూడలేవు.
కుకీలను నిల్వ ఉంచడం, పంపడం అనే కార్యకలాపాలు అప్రమేయంగా మీకు కనపడవు. కానీ, కుకీలను నిల్వ చేసే అభ్యర్థనలను మీరే ఆమోదించేలా లేదా తిరస్కరించేలా, ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు నిల్వ ఉంచిన కుకీలను స్వయంచాలకంగా తొలగించడం లాంటి వాటి కొరకు మీరు ఫైర్‌ఫాక్స్ అమరికలను మార్చుకోవచ్చు.
కుకీ అమరికలు
ఫైర్‌ఫాక్స్‌లో కుకీ అమరికలు ఎంపికలుఅభిరుచులు ద్వారా నిర్వహించబడతాయి. ఈ అమరికలను చూడడానికి:
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- గోప్యతా, బ్రౌజింగ్ చరిత్ర మరియు ట్రాక్ చేయద్దు కోసం సెట్టింగులు చూడండి. ప్యానెలు ఎంచుకోండి. మరింత సమాచారానికి చరిత్రకుకీలు, సైటు డేటా విభాగానికి వెళ్ళండి. ప్యానెలును ఎంచుకొని
కొన్ని అవసరాలకు తగ్గట్టు కుకీ అమరికలను ఎలా మార్చుకోవాలో సూచనలకు, చూడండి:
- మీ అభిరుచుల జాడతెలుసుకోడానికి వెబ్‌సైట్లు ఉపయోగించే కుకీలను చేతనం, అచేతనం చెయ్యడం: ఫైర్‌ఫాక్స్‌లో కుకీల నిల్వను ఎలా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవాలి.
- వెబ్‌సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ చేసిన సమాచారం తొలగించడానికి కుకీలను తొలగించు.: వెబ్‌సైట్లు ఇప్పటికే నిల్వ చేసిన కుకీలను ఎలా తొలగించుకోవాలి.
- Block websites from storing cookies and site data in Firefox: కొన్ని వెబ్‌సైట్లు కుకీలను నిల్వ చేయకుండా ఎలా నిరోధించాలి.
- Third-party cookies and Firefox tracking protection: మీరు ప్రస్తుతం చూస్తున్న వెబ్‌సైటు తప్ప ఇతర వెబ్‌సైట్లు కుకీలను నిల్వ చేయకుండా ఎలా నిరోధించాలి.
కుకీల సమస్యా పరిష్కారం
ఫైర్‌ఫాక్స్‌లో మీకు కుకీలకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, చూడండి