మీరు జాల విహరణ చేస్తున్నప్పుడు, ఫైర్‌ఫాక్సు మీకొరకు చాల సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది - మీరు దర్శించిన సైట్లు, దింపుకున్న ఫైళ్లు ఇలా మరికొన్ని. ఈ సమాచారాన్ని అంతా మీ చరిత్రగా పిలుస్తారు. కానీ, మీరు ఒక బహిరంగ కంప్యూటరును వాడుతున్నా లేదా మీ కంప్యూటరును వేరొకరితో పంచుకున్నా, ఇలాంటివి మిగతావారు చూడడం మీరు ఇష్టపడకపోవచ్చు.
ఈ వ్యాసం మీ ఫైర్‌ఫాక్సు చరిత్రలో ఏ సమాచారం భద్రపరచబడుతుందో వివరిస్తుంది మరియు దానిని పూర్తిగా లేదా కొంతభాగం తుడిచివేయడానికి మీకు దశలవారీ విధానాలను ఇస్తుంది.
- తాత్కాలికంగా ఫైర్‌ఫాక్సు చరిత్రను నిల్వ చేయకుండా ఉండడానికి ప్రైవేట్ బ్రౌజింగ్ - చరిత్రను సేవ్ చేయకుండా ఫైర్ఫాక్స్ ఉపయోగించండి చూడండి.
విషయాల పట్టిక
నా చరిత్రలో ఏ విషయాలు చేర్చబడ్డాయి?
- విహరణ & దింపుకోలు చరిత్ర: విహరణ చరిత్ర అనేది చరిత్ర మెనులో చూపించబడే మీరు దర్శించిన సైట్ల జాబితా, లైబ్రరీ విండో చరిత్ర జాబితా మరియు స్థానం బార్ స్వయంపూర్తి చిరునామా జాబితా. దింపుకోలు చరిత్ర అనేది దింపుకోళ్ల విండోలో చూపబడే మీరు దింపుకున్న ఫైళ్ల జాబితా.
- ఫారం & శోధన బార్ చరిత్ర: ఫారం చరిత్రలో ఫారం స్వయంపూర్తి ద్వారా మీరు నమోదు చేసిన అంశాలు ఉంటాయి. శోధన బార్ చరిత్రలో ఫైర్‌ఫాక్సు శోధన బార్ ద్వారా మీరు నమోదు చేసిన అంశాలు ఉంటాయి.
- కుకీలు: కుకీలు సైటు అభిరుచులు లేదా లాగిన్ స్థితి వంటి మీరు దర్శించిన వెబ్సైట్ల గురించిన సమాచారాన్ని భద్రపరుస్తాయి. అడోబె ఫ్లాష్ వంటి ప్లగిన్లు భద్రపరిచే సమాచారం మరియు సైటు అభిరుచులు కూడా ఇలాంటిదే. మిమ్మల్ని వివిధ సైట్ల మధ్య వెంబడించడానికి కూడా కుకీలను బయటివారు ఉపయోగించవచ్చు. వెంబడించడం గురించి మరింత సమాచారం కోసం నేను Do Not Track ఫీచర్ ను ఎలా ఆన్ చేయాలి? చూడండి. గమనిక: ఫ్లాష్ అమర్చిన కుకీలను తొలగించడానికి మీరు తాజా రూపాంతరాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. సూచనలకోసం ఫ్లాష్ నవీకరణ చూడండి.
- కాష్: కాష్ అంటే మీరు ఇంతకుముందే చూసిన పేజీలు, సైట్లు త్వరగా లోడు అవడానికి ఫైర్‌ఫాక్సు అంతర్జాలం నుండి దింపుకున్న వెబ్ పేజీలు మరియు ఇతర ఆన్లైను ప్రసారసాధనాలు వంటివి భద్రపరిచే తాత్కాలిక ఫైళ్లు.
- క్రియాశీల లాగిన్లు: మీరు అతినూతనంగా ఫైర్‌ఫాక్సును తెరచిన తరువాత, మీరు HTTPS ధ్రువీకరణ ద్వారా ఒక వెబ్సైటులోకి లాగిన్ అయిఉంటే, ఆ సైటును "క్రియాశీలం"గా భావిస్తారు. కాష్‌ని తొలగిస్తే మీరు అటువంటి సైట్లనుండి లాగౌట్ చేయబడతారు.
- ఆఫ్లైను వెబ్సైటు డేటా: మీరు అనుమతిస్తే, వెబ్సైటు ఫైళ్లను మీ కంప్యూటరులో భద్రపరచుకోగలదు, తద్వారా మీరు అంతర్జాలానికి అనుసంధానం కానప్పటికీ మీరు దానిని ఉపయోగించవచ్చు.
- సైటు అభిరుచులు: సైటు-సంబంధిత అభిరుచులు, సైట్ల భద్రపరచబడిన జూమ్ స్థాయితో సహా, అక్షర ఎన్‌కోడింగు మరియు (పాపప్ బ్లాకర్ వంటి మినహాయింపులు వంటి) సైట్ల అనుమతులు పేజి సమాచరం విండోలో వివరించబడ్డాయి.
నేను నా చరిత్రను ఎలా తొలగించాలి?
- లైబ్రరీ బొత్తాన్ని నొక్కండి , నొక్కి తరువాత నొక్కండి.
- ఎంత చరిత్రను తొలగించాలో ఎంపిక చేసుకోండి:
- మీ ఫైర్‌ఫాక్సు చరిత్రను ఎంత తొలగించాలో ఎంచుకోవడానికి Time range to clear పక్కనున్న డ్రాప్-డౌన్ మెనుని నొక్కండి.
- తరువాత, Details క్రింద ఏ సమాచారాన్ని తొలగించాలో ఎంపిక చేసుకోండి. మీ ఎంపికలు పైనున్న నా చరిత్రలో ఏమేమి ఉన్నాయి? విభాగంలో వివరించబడ్డాయి.
- చివరగా, బొత్తాన్ని నొక్కండి. ఆ విండో మూయబడి మీరు ఎంపిక చేసుకున్న అంశాలు తొలగించబడతాయి.
- లైబ్రరీ బొత్తాన్ని నొక్కండి , నొక్కి తరువాత నొక్కండి.
- ఎంత చరిత్రను తొలగించాలో ఎంపిక చేసుకోండి:
- మీ ఫైర్‌ఫాక్సు చరిత్రను ఎంత తొలగించాలో (గత గంట, గత రెండు గంటలు, గత నాలుగు గంటలు, గత దినం లేదా అన్నీ) ఎంచుకోవడానికి Time range to clear పక్కనున్న డ్రాప్-డౌన్ మెనుని నొక్కండి.
- ఎంపిక డబ్బాలద్వారా మీ చరిత్రలో ఏ సమాచారాన్ని తొలగించాలో ఎంచుకోండి. మీ ఎంపికలు పైనున్న నా చరిత్రలో ఏమేమి ఉన్నాయి? విభాగంలో వివరించబడ్డాయి.
- చివరగా, బొత్తాన్ని నొక్కండి. ఆ విండో మూయబడి మీరు ఎంపిక చేసుకున్న అంశాలు తొలగించబడతాయి.
ఫైర్‌ఫాక్సు నా చరిత్రను స్వయంచాలకంగా తొలగించేట్టు ఎలా చేయాలి?
"ఫైర్‌ఫాక్సును వాడిన ప్రతిసారీ మీరు మీ చరిత్రను తొలగించాలనుకుంటే, మీరు అది ఫైర్‌ఫాక్సు నిష్క్రమించేటప్పుడు స్వయంచాలకంగా జరిగేట్టు అమర్చుకోవచ్చు.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
పానెల్ ని ఎంచుకోండి .
- ఫైర్ఫాక్స్ రెడీ: కు చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండి.
- Clear history when Firefox closes పెట్టెను ఎంచుకోండి.
- ఏ తరహా చరిత్రను తొలగించాలో నిర్దేశించడానికి Clear history when Firefox closes పక్కన ఉన్న బొత్తాన్ని నొక్కండి.
- Settings for Clearing History విండోలో ఫైర్‌ఫాక్సు నిష్క్రమించేప్పుడు స్వయంచాలకంగా ఏ అంశాలను తొలగించాలో ఎంచుకోండి.
- తొలగించాల్సిన చరిత్రను ఎంపిక చేసుకున్న తరువాత, Settings for Clearing History విండోని మూసివేయడానికి ని నొక్కండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
గమనిక: కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఈ ఫంక్షను పనిచేయకపోవచ్చు:
- "ఫైర్‌ఫాక్సు సరిగా నిష్క్రమించలేదు" ఫైర్‌ఫాక్సు క్రాష్ అయితే, మీరు దానిని మొదలుపెట్టి మామూలుగా నిష్క్రమించడం వలన ఈ ఫంక్షన్ పనిచేస్తుంది.
- "ఫైర్‌ఫాక్సు స్వయంచాలక ఆంతరంగ విహరణగా అమర్చబడినది." సాధారణ సెషన్లలో దాచిన చరిత్రను ఒక సాధారణ విండోలోనే తొలగించగలము. సాధారణ రీతి మరియు స్వయంచాలక అంతరంగ విహరణల మధ్య మారుటకు ప్రైవేట్ బ్రౌజింగ్ - చరిత్రను సేవ్ చేయకుండా ఫైర్ఫాక్స్ ఉపయోగించండి చూడండి.
ఒక నిర్దిష్ట వెబ్సైటు కుకీలు, దత్తాంశాన్ని తొలగించండి
- చిరునామా బారుకు ఎడమవైపున ఉన్న సైటు సమాచారం బొత్తాన్ని నొక్కండి.
ఒక వెబ్సైటును మీ చరిత్రనుండి తొలగించండి
ఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ బటన్, మెను కి వెళ్ళండి మరియు ఎంచుకోండి లైబ్రరీ విండోని తెరవడానికి.మెనూబార్ మిద, క్లిక్ చియండి మెను మరియు ఎంచుకోండి లైబ్రరీ విండోని తిరవండి.ఫైరుఫాక్సు విండో ఎగువన, క్లిక్ మెను మరియు ఎంచుకోండి లైబ్రరీ విండోని తెరవడానికి.
మెను బటన్ క్లిక్ చేయండి , ఎంచుకోండి
ఆపై లైబ్రరీ విండోని జాబితా దిగువన ' షో అన్ని చరిత్ర' లింక్ క్లిక్.- పైన కుడివైపు ఉన్న శోధన చరిత్ర క్షేత్రంలో వెబ్సైటు పేరును టైపు చేయడం ద్వారా మీరు తొలగించాలనుకుంటున్న వెబ్సైటును వెతికి, EnterReturn నొక్కండి.
- తరువాత, శోధన ఫలితాలలో, మీరు తీసివేయాలనుకున్న సైటుపై కుడి క్లిక్క్లిక్ చేస్తూ Ctrl వత్తి ఉంచి ఎంపిక చేసుకోండి.ఆ సైటు చరిత్ర అంశాలు అన్నీ (విహరణ మరియు దింపుకోలు చరిత్ర, కుకీలు, కాష్, క్రియాశీల లాగిన్లు, సంకేతపు మాటలు, భద్రపరచబడిన ఫారంల డాటా, కుకీల మినహాయింపులు, బొమ్మలు, పాపప్‌లు) తీసివేయబడతాయి.
- చివరగా, లైబ్రరీ విండోని మూసివేయండి.