ఫైర్‌ఫాక్స్‌కి స్వాగతం! మీరు త్వరితగతిన ఉపయోగించుకోవడానికి కావలసిన ప్రాథమిక అంశాలను చూపిస్తాం. ప్రాథమికాలను దాటి ముందుకువెళ్ళడానికి తయారుగా ఉన్నప్పుడు, మీరు తర్వాత చూడాల్సిన విశేషాల గురించి ఇతర లంకెలను చూడండి.
విషయాల పట్టిక
- 1 కొత్త ట్యాబు పేజీ: మీకు అందుబాటులోనే గొప్ప సమాచారం
- 2 ఏకీకృత వెతుకుడు/చిరునామా పట్టీతో దేన్నైనా వెతకండి
- 3 పేజీ చర్యల మెనూ: ఇష్టాంశంగా, చిటికెలో, భద్రపరచుకోండి లేదా పంచుకోండి
- 4 ట్రాకింగ్ సంరక్షణతో అంతరంగిక విహారణ: వేగంగా స్వేచ్ఛగా విహరించండి
- 5 మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి
- 6 ఒక నొక్కు చేరువలో ముంగిలి
- 7 మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి
- 8 మీ ముంగిలి పేజీని అమర్చుకోవడం లేదా మార్చుకోవడం
- 9 జాలాన్ని వెతకడం
- 10 ఒక వెబ్‌సైటుని ఇష్టాంశం చేసుకోవడం
- 11 ఆఁసమ్ బారుతో అన్నీ వెతకండి
- 12 అంతరంగిక విహారణ
- 13 మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి
- 14 పొడగింతలతో మీ ఫైర్‌ఫాక్స్‌కి సౌలభ్యాలు చేర్చుకోండి
- 15 మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి
- 16 సహాయం పొందండి
కొత్త ట్యాబు పేజీ: మీకు అందుబాటులోనే గొప్ప సమాచారం
అప్రమేయంగా, మీరు కొత్త ట్యాబు తెరచిన ప్రతీసారీ ఫైర్‌ఫాక్స్ మీకు మంచి సమాచారాన్ని అందిస్తుంది. ఆయా విభాగాల మీద, నఖచిత్రాలపైన హోవర్ చేసి లేదా పళ్ళచక్రం ప్రతీకం మీద నొక్కి ఈ పేజీని మీరు అభిమతీకరించుకోవచ్చు.
ఏకీకృత వెతుకుడు/చిరునామా పట్టీతో దేన్నైనా వెతకండి
మీకు ఖచ్చితమైన జాల చిరునామా తెలిసినా లేదా కేవలం వెతుకుతున్నా, ఏకీకృత ఆఁసమ్ బార్ అన్నింటినీ చేస్తుంది. మీ ప్రస్తుత ఇష్టాంశాలు, చరిత్ర, తెరిచివున్న ట్యాబులు, ప్రసిద్ధమైన వెతుకులాటల నుండి సూచనలను ఫైర్‌ఫాక్స్ లోని చిరునామా పట్టీ మీకు ఇస్తుంది. అది అద్భుతం కాదా? చిరునామానో లేదా వెతకడానికో టైపు చెయ్యడం మొదలుపెట్టండి, మాయ జరగడం చూడండి.
పేజీ చర్యల మెనూ: ఇష్టాంశంగా, చిటికెలో, భద్రపరచుకోండి లేదా పంచుకోండి
నిజంగా అద్భుతమైన జాల పేజీని కనుగొన్నారా? దాన్ని భద్రపరచుకోండి లేదా పంచుకోండి. చిరునామా పట్టీ లోని పేజీ చర్యల మెనూ జాల పేజీలను ఇష్టాంశాలుగా భద్రపరుచుకోనిస్తుంది, లంకెలను కాపీ లేదా ఈమెయిలు చేయనిస్తుంది, తెరపట్లు తీసుకోనిస్తుంది, ఇంకా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకొనగలిగేలా మీ ఫోను లోనికి పేజీలను పంపనిస్తుంది లేదా మీ పాకెట్ జాబితాలో భద్రపరుస్తుంది.
ట్రాకింగ్ సంరక్షణతో అంతరంగిక విహారణ: వేగంగా స్వేచ్ఛగా విహరించండి
మీరు చూసిన సైట్లు, పేజీల గురించి ఎటువంటి సమాచారాన్నీ మీ కంప్యూటరులో భద్రపరచకుండానే అంతర్జాలాన్ని విహరించండి. జాలంలో మీ జాడ తెలుసుకోవాలనుకునే భయపెట్టే ట్రాకర్లను కూడా ఫైర్‌ఫాక్స్ నిరోధిస్తుంది.
- మెను బొత్తం నొక్కిన తర్వాత కుడి-నొక్కుcontrol + click నొక్కి, తర్వాత అంశాన్ని నొక్కండి.) నొక్కండి. (చిట్కా: మీరు ఒక వెబ్ పేజీ లంకె మీద
మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి
ఫైర్‌ఫాక్స్ ఖాతా పొంది మీ విహారణ సమాచారాన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్ళండి. మెనూ బొత్తం నొక్కి,
ఎంచుకోండి తర్వాత మీ ఖాతా సృష్టించుకోడానికి సూచనలు అనుసరించండి. తర్వాత కొత్తగా సృష్టించిన ఖాతా లోనికి మీ వేరే పరికరంలో ప్రవేశించండి, అంతే!ఒక నొక్కు చేరువలో ముంగిలి
మీరు ఫైర్‌ఫాక్స్ తెరిచినప్పుడు లేదా ముంగిలి బొత్తం మీద నొక్కినప్పుడు ఏ పేజీ తెరవాలో ఎంచుకోండి.
- మీ ముంగిలి పేజీగా వాడుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని ఒక ట్యాబులో తెరవండి.
- ఆ ట్యాబును ముంగిలి బొత్తం మీదకు లాగి వదలండి.
మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి
అత్యంత ప్రాచుర్యమైన సౌలభ్యాలతో పనిముట్లపట్టీని క్రమబద్దీకరించాం కానీ ఫైర్‌ఫాక్స్‌లో చాలా సౌలభ్యాలు దాగి ఉన్నాయి. ఓ చూపు చూడండి!
- మెనూ బొత్తం నొక్కి నొక్కండి.
- మీకు కావలసిన సౌలభ్యాలను పనిముట్లపట్టీ మీదకు లేదా కుడివైపున ఉన్న ప్యానెలు మీదకు లాగి వదలండి.
- మీరు ముగించిన తర్వాత, బొత్తాన్ని నొక్కండి.
మీ ముంగిలి పేజీని అమర్చుకోవడం లేదా మార్చుకోవడం
మీరు ఫైర్‌ఫాక్స్‌ను మొదలుపెట్టినప్పుడు లేదా ముంగిలి బొత్తాన్ని నొక్కినప్పుడు ఏ పేజీ తెరచుకోవాలో ఎంచుకోండి.
- మీ ముంగిలి పేజీగా వాడుకోవాలనుకుంటున్న వెబ్‌పేజీని ఒక ట్యాబులో తెరవండి.
- ఆ ట్యాబును ముంగిలి బొత్తం మీదికి లాగి వదలండి.
- దీన్ని మీ ముంగిలి పేజీగా మార్చుకోడానికి నొక్కండి.
ముంగిలి పేజీ వ్యాసంలో మరిన్ని ఎంపికలు చూడవచ్చు.
జాలాన్ని వెతకడం
ఫైర్‌ఫాక్స్ లోని అంతర్నిర్మిత వెతుకుడు పట్టీతో మీ అభిమాన సెర్చింజనుని ఎంచుకోండి.
- వెతుకుడు పట్టీలో టైపు చెయ్యడం మొదలుపెట్టి మీకు కావలసిన సెర్చింజను మీద నొక్కండి.
వెతుకుడు చిట్కాల గురించి తెలుసుకోడానికి వెతుకుడు పట్టీ వ్యాసం చూడండి.
ఒక వెబ్‌సైటుని ఇష్టాంశం చేసుకోవడం
మీ అభిమాన సైట్లను భద్రపరచుకోండి.
- ఒక ఇష్టాంశం చేసుకోడానికి, పనిముట్లపట్టీ లోని నక్షత్రాన్ని నొక్కండి. ఆ నక్షత్రం నీలంగా మారుతుంది, మీరు ఉన్న పేజీకి ఇష్టాంశం క్రమబద్దీకరించని ఇష్టాంశాలుఇతర ఇష్టాంశాలు సంచయంలో సృష్టించబడుతుంది. అంతే!
మరింత సమాచారం కోసం, ఇష్టాంశాల వ్యాసం చూడండి.
ఆఁసమ్ బారుతో అన్నీ వెతకండి
మేము ఫైర్‌ఫాక్స్ లోని చిరునామా పట్టీని "ఆఁసమ్ బార్" అంటాం ఎందుకంటే అది మీరు ఇదివరకు చూసిన చోట్లను తొందరగా కనుగొంటుంది.
- చిరునామా పట్టీలో టైపు చెయ్యడం మొదలుపెట్టండి, మీకు మీ విహరణ చరిత్ర నుండి మీ ఇష్టాంశాల నుండి పేజీల జాబితా కనిపిస్తుంది. మీకు కావలసిన పేజీ కనబడగానే, దాని మీద నొక్కండి.
మరిన్ని చిట్కాలను తెలుసుకోడానికి, ఆఁసమ్ బార్ వ్యాసం చూడండి.
అంతరంగిక విహారణ
ఫైర్‌ఫాక్స్ లోని అంతరంగిక విహారణ సౌలభ్యం మీరు చూసిన సైట్లు, పేజీల గురించి ఎటువంటి సమాచారాన్నీ మీ కంప్యూటరులో భద్రపరచకుండానే మీరు అంతర్జాలాన్ని విహరించే వీలుకల్పిస్తుంది.
- మెనూ బొత్తం నొక్కిన తర్వాత
అంతరంగిక విహారణ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
మెనూని లేదా పనిముట్ల పట్టీని అభిమతీకరించుకోండి
మీ మెనూ లేదా పనిముట్ల పట్టీలో కనబడే అంశాలను మీరు మార్చుకోవచ్చు.
- మెనూ బొత్తం చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. నొక్కి
- మెనూ లేదా పనిముట్లపట్టీ నుండి లేదా లేనికి అంశాలను లాగి వదలడానికి వీలుకల్పించే ప్రత్యేకమైన ట్యాబు తెరుచుకుంటుంది.
ఎంచుకోండి.
- పూర్తయిన తర్వాత, ఆకువచ్చ బొత్తాన్ని నొక్కండి.
customizing Firefox గురించి మరింత తెలుసుకోండి.
పొడగింతలతో మీ ఫైర్‌ఫాక్స్‌కి సౌలభ్యాలు చేర్చుకోండి
పొడగింతలు అనేవి ఫైర్‌ఫాక్స్‌ను మీరు కోరుకున్నట్టు పనిచేసేలా చేసుకోడానికి మీరు స్థాపించుకోగలిగిన అనువర్తనాల లాంటివి.
-
ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని , మరియు ఆ తరువాత నొక్కండి నొక్కండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి మరియు ఎంచుకోండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
- ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి పెనెల్.
- ఒక విశేష పొడగింత లేదా అలంకారం గురించి మరింత సమాచారం తెలుసుకోడానికి, దానిపై నొక్కండి. ఆ తర్వాత దాన్ని స్థాపించుకోడానికి మీరు ఆకుపచ్చ
- పైన ఉన్న వెతుకుడు పెట్టెను ఉపయోగించి మీకు కావలసిన ప్రత్యేక పొడగింతల కోసం వెతకవచ్చు. తద్వారా కనుగొన్న పొడగింతలను
బొత్తంపై నొక్కవచ్చు.
- పైన ఉన్న వెతుకుడు పెట్టెను ఉపయోగించి మీకు కావలసిన ప్రత్యేక పొడగింతల కోసం వెతకవచ్చు. తద్వారా కనుగొన్న పొడగింతలను
- మీరు అడిగిన పొడగింతను ఫైర్‌ఫాక్స్ దింపుకుంటుంది, ఆ పొడగింతను మీరు స్థాపించుకోవాలనుకుంటున్నారని నిర్ధారించమని మిమ్మల్ని అడగవచ్చు కూడా.
- అవసరమైతే బొత్తం నొక్కండి. మీ ట్యాబులు భద్రపరచబడి పునఃప్రారంభమైన తర్వాత కనిపిస్తాయి.
-
ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని , మరియు ఆ తరువాత నొక్కండి నొక్కండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి మరియు ఎంచుకోండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
- ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి పెనెల్.
- విశేష పొడగింతను స్థాపించుకోడానికి, బూడిద రంగు టాగుల్ బొత్తాన్ని నొక్కండి, అది ఆకుపచ్చగా మారుతుంది. మీరు స్థాపించుకున్న పొడగింతను తీసివేయడానికి, టాగుల్ బొత్తాన్ని మళ్ళీ నొక్కండి.
విశేష పొడగింతల జాబితా అడుగున,
అనే బొత్తాన్ని మీరు నొక్కవచ్చు. అది మిమ్మల్ని addons.mozilla.orgకి తీసుకెళ్తుంది అక్కడ మీరు ప్రత్యేక పొడగింతల కొరకు వెతకవచ్చు.పొడగింతల గురించి మరింత తెలుసుకోడానికి, వెతుకుము మరియు పొడగింతలు ఫైర్ఫాక్స్ లక్షణాలను జోడించడానికి ఇన్స్టాల్ చూడండి.
మీ ఫైర్‌ఫాక్స్‌ను సింక్రనించుకోండి
ఏ పరికరం నుండైనా మీ ఇష్టాంశాలను, చరిత్రను, సంకేతపదాలను పొందండి.
- ముందుగా ఒక ఫైర్‌ఫాక్స్ ఖాతాను సృష్టించుకోండి:
- మెనూ బొత్తం నొక్కి ఎంచుకొని తర్వాత మీ ఖాతాను సృష్టించుకోడానికి సూచనలను అనుసరించండి.
- ఆ తర్వాత మరొక పరికరాన్ని అనుసంధానించడానికి ప్రవేశించండి.
మరింత వివరణాత్మక సూచనలకు నేను నా కంప్యూటర్లో సింక్ ఎలా సెటప్ చేయాలి చూడండి
సహాయం పొందండి
మీకు ఇంకా సందేహాలుంటే, లేదా ఎప్పుడైనా ఫైర్‌ఫాక్స్ గురించి సహాయం కావల్సివస్తే, మీరు సరైన వెబ్‌సైటులోనే ఉన్నారు.
- మీకు ఉండే దాదాపు ప్రతీ సందేహాన్నీ తీర్చేలా ఈ సైటులో వందలాది వ్యాసాలు ఉన్నాయి.