Contributors
Contributors
సృష్టించబడినది:
అన్ని వ్యాసాలు
- మొజిల్లా అనువాద సహాయం
- తోడ్పాటు స్థానికీకరణ ఎలా పనిచేస్తుంది? (మీరు ఇక్కడ ఉన్నారు)
- Translating an article
- How do I update articles after their first translation?
- L10N guidelines for reviewing translated articles
- How to be a SUMO Locale Leader
ఈ జాబితాలో ఉండాల్సిన వ్యాసం ఏదైనా లేదనుకుంటే, Michałని సంప్రదించండి
తోడ్పాటు స్థానికీకరణలో రెండు భాగాలు ఉన్నాయి:
- మొదటి భాగం వాడుకరి అంతరవర్తి (బొత్తాలు, పక్కపట్టీలోని పాఠ్యం, మొదలైనవి.). అందుకోసం, దయచేసి How to localize the SUMO interface చదవండి. ప్రస్తుతం సుమో అంతరవర్తి స్థానికీకరణ వేరే ఓపెన్ సోర్సు అనువర్తనం ద్వారా సుమో బయట జరుగుతుంది, దానికి మరో ఖాథా కావాలి.
- తర్వాత భాగం అసలు వ్యాసాలు. మీరు వీటిని స్థానికీకరించవచ్చు:
- సాధారణ వ్యాసాలు: ఇవి సందర్శకుల కోసం ఉద్దేశించిన జ్ఞాన నిధి వ్యాసాలు, ప్రతీ వికీ లానే, అయితే వీటిని అనువదించవచ్చు కూడా. సాధారణ వ్యాసాలు రెండు రకాలు:
- సమస్యాపరిష్కారం: ఏదైనా సమస్యని ఎలా పరిష్కరించాలో తెలిపే వ్యాసాలు (ఉదాహరణకు: ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అయింది లేదా స్పందించడం లేదు - పరిష్కరించడం ఎలా).
- ఎలా: ఒక సౌలభ్యాన్ని ఎలా వాడుకోవాలో వివరించే వ్యాసాలు (ఉదాహరణకు: పరమాద్భుతం బార్ - చిరునామా బార్ నుండి మీ Firefox బుక్‌మార్క్‌లను, చరిత్రను మరియు టాబ్లను శోధన).
- ప్రత్యేక వ్యాసాలు (గమనిక: మార్గదర్శకం, మూసలు/విషయ పేటికలు తప్ప, వీటిసి సాధారంగా స్థానికీకరణ అవసరం లేదు):
- మార్గదర్శకం: ఇవి ప్రత్యేక పేజీలు, మొదటి పేజీ వంటివి, లేదా సమూహ తోడ్పాటు పొండండి వంటి పేజీలు. (ఉదాహరణకు: కమ్యూనిటీ మద్దతు పొందండి)
- మూసలు/విషయ పేటికలు: ఇవి వ్యాసం లోని భాగాలు. అభిరుచుల కిటికీని ఎలా తెరవాలి వంటివి చాలా వ్యాసాలలో కనిపిస్తాయి, కనుక వాటీని ఒక్కసారి వ్రాసి కావలసిన వ్యాసాలలో చొప్పించవచ్చు. అందుకోసం మూసలను వాడతాము. (ఉదాహరణకు: Template:adddevices)
- ఎలా తోడ్పడాలి: ఇవి సహాయకులకు ఉద్దేశించిన వ్యాసాలు. వీటిని స్థానికీకరించాల్సిన అవసరం లేదు, అవి సహాయకులుగా నమోదైనవారికి మాత్రమే కనిపిస్తాయి, వెతుకుడు ఫలితాలలోనూ కనిపించవు. అలాంటి వ్యాసాన్నే మీరిప్పుడు చదువుతున్నారు :-).
- నిర్వహణ: పై వర్గాలకు చెందని ఇతర వ్యాసాలు.సుమో లోని అన్ని వ్యాసాలు ఒకే పనిముట్టు ద్వారా స్థానికీకరించబడతాయి, ఇది సుమో లోనే అంతర్‌నిర్మితం, దానికి వేరే ఖాతాలు అవసరం లేదు.
స్థానికీకరణకు వాడే వివిధ సమాచారం, సైటు పనిముట్ల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ క్రించి చిన్న వీడియోలను చూడండి:
తదుపరి, వ్యాసాలను అనువదించడం చదవండి.
మీకేమైనా సందేహాలున్నాయా? స్థానికీకరించడంలో మీకేమైనా సహాయం కావాలా? l10n ఫోరంలో మాకు చెప్పండి.